Header Banner

తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడ వడ్డింపు ప్రారంభం! నూతన వడ ప్రసాదంతో భక్తుల ఆనందం రెట్టింపు!

  Thu Mar 06, 2025 16:09        India

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం, టీటీడీ ఛైర్మన్ భక్తులకు వడ ప్రసాదం పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, తన బాధ్యతలు స్వీకరించిన తర్వాత భక్తులకు అదనంగా వడ వడ్డించాలనే ఆలోచన వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి అందించిన తర్వాత, ఆయన అంగీకరించడంతో ఈ వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

ఈ వడ తయారీకి శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపు వంటి నాణ్యమైన పదార్థాలు ఉపయోగించబడతాయని తెలిపారు. ఇకపై ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు 35 వేల వడలు భక్తులకు పంపిణీ చేయనున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచి భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించనున్నామని టిటిడి ఛైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అక్రమ రవాణా వ్యవహారం పై... వారికి త్వరలో కఠిన చర్యలు! అసెంబ్లీలో షాకింగ్ వివరాలు!

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Tirumala #TTD #Annaprasadam #VadaPrasadam #Bhakti #TirumalaDarshan #TTDUpdates #DevotionalFood #TemplePrasadam #SpiritualJourney